Header Banner

అసెంబ్లీకి రావడం లేదు... ప్రశ్నిస్తామనే భయమా జగన్? నీచ రాజకీయాలపై మంత్రి తీవ్ర విమర్శలు!

  Fri Feb 21, 2025 17:03        Politics

వైఎస్ జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని ఫైర్ అయ్యారు.. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? అని నిలదీశారు.. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డుమీద నిల్చోబెట్టినా.. జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు.. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని వెల్లడించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!


అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు చెప్పినా.. రాజకీయ స్వార్థానికే వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కి వెళ్లారని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి… ఐ ప్యాక్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రవీంద్ర.. బూతులు మాట్లాడడానికైతే ఉద్యోగం అవసరం… ప్రజాసేవ చేయడానికి ఉద్యోగం కావాలా? అని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న.. అధికారంలో ఉన్న... ప్రజలకు జవాబుదారీగానే తాము పని చేశాం. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన కృష్ణాజిల్లా.. ఖ్యాతిని తిరిగి తీసుకొచ్చేందుకు మేమంతా కష్టపడుతున్నాం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #minister #fire #jagan #cheap #todaynews #flashnews #latestupdate